Naga Seshu, Dr B.
9355663722
ISBN 13: 9789355663726
Softcover

49
ING9789355663726
Special order direct from the distributor

అక్షరంతో ఏర్పడిన బంధాలు అక్షరం ఉండే వరకూ ఉంటాయి. మనం ఎందుకు రాస్తున్నాం అనే ప్రశ్న మనలో కలిగినప్పుడు మనలో పుట్టే సాహిత్యం, రాతలు విలువైనవిగా సమాజానికి ఉపయోగపడేలా ఉంటాయి. వ్యక్తి కేంద్రంగా కానీ, మతం కేంద్రంగా గాని, కులం కేంద్రంగా గాని చేసే రచనల వల్ల కేవలం పరిమితంగా ఉండిపోతాయి. రచయిత వెలుగును ప్రసాదించాలి. ఇక అవార్డుల కోసం రాసే వారి గురించి చెప్పక్కర్లేదు. (అవి ఇక్కడ మాట్లాడుకో రాదు కూడా) నాకైతే తాను తినడానికి తిండి లేని పేదరికం, నా ఆకలికి సరైన సమయానికి తిండి ఒదిగించలేని మా అమ్మ, నిత్యం కాయిలాతో పడుండే నన్ను సగం చినిగిన పాత చీరను జోలగా వేసి తన ఆకలి పేగులు మొరుగుతున్నా, వాటిని కమ్మటి రాగాలుగా గొంతులో పలికించే మా అమ్మ జోల పాటలు, తను చెప్పులేసుకోకుండా నా కాళ్లకు చెప్పులేయించిన మా అప్ప, (నాన్న) పేదరికపు పాతాళంలోకి పడిపోయిన మాకుటుంబాన్ని ఒడ్డుకు చేర్చాలని వయసును కూడా ఆలోచించకుండా చిన్నతనంలోనే బాధ్యతగా కుటుంబాన్ని నెత్తికేసుకుని తిండి కోసం జీతాలు ఉన్న మా అన్నలు, నా స్థితిని తెలుసుకుని ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహాయం అందించిన నా స్నేహితులు, ఎక్కడ ప్రయాణం చేసినా ఆంధ్రదేశమంతా ఆప్యాయంగా పలకరించే అక్షర నేస్తగాళ్లు. సందర్భమో, సంకోచమో, బాధో, సుఖమో, నెగిటివ్ గానో, పాజిటివ్ గానో, నువ్వు రాసిన పదముకాని, వాక్యముకాని, శోధనకాని, వేదనకానీ, కథకానీ, కవితకానీ పరుల మనసును పరామర్శిస్తే ఆ రచయిత జీవితం ధన్యం. ఇరుగు -పొరుగు పుస్తకాన్ని ఆదరించినట్టే, తగటు పుస్తకాన్ని కూడా ఆదరించి అక్కున చేర్చుకుంటారనే ఆశతో మీ ముందుంచుతున్నాను.


Free ShippingOn orders $50 or more. North America only.Learn More